telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రపతిని కలిసిన రఘురామకృష్ణరాజు

raghauramakrishnam raju mp

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ రోజు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఇటీవలి పరిణామాలపై రాష్ట్రపతితో మాట్లాడినట్టు రఘురామకృష్ణరాజు వెల్లడించారు. తిరుమల శ్రీవారి భూముల అమ్మకం, ఇసుక అక్రమాలు తనకు వ్యతిరేకంగా మారారని, వారి అనుచరులతో కేసులు పెట్టించైనా విషయాన్ని రాష్ట్రపతికి వివరించానని తెలిపారు. వీటికి సంబంధించిన ఫొటోలను కూడా ఆయనకు సమర్పించానని చెప్పారు.

కేంద్ర బలగాలతో భద్రత కోరుతూ తాను లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన విషయం, ఆ లేఖను ఆయన కేంద్ర హోంశాఖకు పంపిన విషయం కూడా వివరించానని, కోర్టుకు వెళ్లిన విషయం, రెండువారాల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశాలను కూడా ఆయనకు విన్నవించానని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా, ఈ రెండు వారాలు ఎక్కడుంటారని రాష్ట్రపతి ప్రశ్నించారని, మీ ఇంటికి కూతవేటు దూరంలోనే ఉంటున్నాను సార్ అని చెప్పానని వివరించారు.

Related posts