telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు బంద్!

drunk and drive test to police also

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు తాత్కాలికంగా నిలిపి వేయాలని నిర్ణయించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తనిఖీల మిషన్ల ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి చేరే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సీసీ కెమెరాలు వాహన చోదకులను గమనిస్తుంటాయని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ఇదే సమయంలో పెండింగ్ చలానాల వసూళ్ల పై దృష్టి పెట్టాలని అధికారులు నిర్ణయించారు. సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే సీసీ కెమెరాల ద్వారా పసిగట్టి వాహన చోదకులకు జరిమానాలు విధిస్తారు. ఈ విషయం చాలామంది వాహన చోదకులు గుర్తించరు. అలాంటి వారి నుంచి రావల్సిన జరిమానాలు వసూలు చేయాలని పోలీసులు నిర్ణయించారు.

Related posts