telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఐశ్వర్యా ఆత్మహత్య పై స్పందించిన రాహుల్ గాంధీ…

హైదరాబాద్ షాద్‌నగర్‌లోని శ్రీనివాస కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్యా రెడ్డి ఆత్మహత్య విషాదాన్ని నింపింది… ఈ నెల 3న ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది ఐశ్వర్య.. ఢిల్లీలోని శ్రీరామ్ లేడీ కాలేజ్ లో సీటు సంపాదించి బీఎస్సీ సెకండియర్‌ చదువుకుంటున్న ఆ విద్యార్థిని… కరోనా నేపథ్యంలో ఇటీవలే తిరిగి ఇంటికి వచ్చింది.. ఓవైపు హాస్టల్ ఖాళీ చేయాలని సమాచారం అందడం.. మరోవైపు ఇంట్లో ఆర్థిక విషయాలపై చర్చ జరగడం.. హాస్టల్ ఖాళీ చేసేందుకు వెళ్లడానికి కూడా త‌మ ద‌గ్గర డబ్బులు లేకపోవ‌డంతో మ‌న‌స్థాపం చెందిందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు… మొదట హిందీలో ట్వీట్ చేసిన ఆయన.. ఆ తర్వాత తెలుగులో… “ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం తెలుపుతున్నాను.. ఉద్దేశ పూర్వకంగా చేసిన నోట్ల రద్దు మరియు లాక్డౌన్ ద్వారా, బీజేపీ ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది… ఇది నిజం! ఇదే నిజం!!” అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపాడు.

Related posts