telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

కరోనా నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: మంత్రి సత్యవతి

sathyavathi rathod

అంగన్‌వాడీ కేంద్రాల్లో కరోనా వైరస్‌ నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. హైద్రాబాద్ లోని డీఎస్‌ఎస్‌ భవనంలో మంత్రి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లక్ష్మీ పథకం కింద అందించే భోజనాన్ని ఉదయం 9 నుంచి 11 గంటల లోపు వండి వేడివేడిగా తల్లులకు, పిల్లలకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు అంగన్‌వాడీ కేంద్రాలకు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఎవరైనా గ్రామాల్లో ఉంటే వెంటనే వారి సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు పరిసరాలను శానిటైజేషన్‌ చేయాలన్నారు. సమావేశాలు, సభలు లేకుండా చూడాలని ఆయా జిల్లాల ఎస్పీలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Related posts