హనుమజ్జయంతి సందర్భంగా నిన్న మెగాస్టార్ చిరంజీవి ఫొటో పోస్ట్ చేసిన హనుమంతుడి ఫొటోని పోస్ట్ చేశారు. ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామితో నాకు చాలా అనుబంధం ఉందిని తెలిపారు. చిరు చేసిన పోస్ట్ అభిమానులను బాగా అలరించింది. దీనిపై ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మా ఇంట్లో హనుమంతుడిని ఆరాధించడమనేది మా సోదరుడు చిరంజీవిగారి వల్లే అలవాటైందని పేర్కొన్నారు. ఇదే విషయం మా నాన్నను నాస్తిక, కమ్యూనిస్టు భావాల నుంచి రాముడి భక్తుడిగా మార్చింది. నా టీనేజ్‌లో ఉన్నప్పుడు నేను హనుమంతుడి చాలీసాను 108 సార్లు అప్పుడప్పుడు చదివేవాడిని. జై హనుమాన్’ అని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిరు చేసిన ఆ ట్వీట్‌ను పవన్ రీట్వీట్ చేశారు.