telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలకృష్ణకు విలన్ గా కోలీవుడ్ హీరోయిన్ ?

Namitha

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ “బిబి-3” పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్, కరోనా కారణంగా వాయిదా పడగా, త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెల 15 నుంచి బాలయ్య ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అలాగే హీరోయిన్ గురించి రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. తెలుగు అమ్మాయి అంజలి ఈ సినిమా హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆ తరవాత బాలీవుడ్ బ్యూటీ అంటూ పుకార్లు షికారు చేసాయి. చివరకు మలయాళీ భామ ప్రయాగ మార్టిన్ నటిస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే పదేళ్ల కింద వచ్చిన ‘సింహా’ సినిమాలో బాలయ్య సరసన నమిత నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి బాలయ్య – బోయపాటి కాంబోలో వస్తున్న సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం ఆమెను సంప్రదించారట. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

Related posts