telugu navyamedia
తెలంగాణ వార్తలు

వ‌రంగ‌ల్‌లో టీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. పార్టీకి ప్ర‌దీప్ రావు గుడ్ బై

*వ‌రంగ‌ల్‌లో టీఆర్ఎస్ కు షాక్.. పార్టీకి ప్ర‌దీప్ రావు గుడ్ బై
*ఈ నెల 7న‌ టీఆర్ఎస్ కు రాజీనామా చేసే అవ‌కాశం
*రేపు ముఖ్య అనుచ‌రుల‌తో భేటి కానున్నప్రదీప్ రావు

టీఆర్ఎస్ కు వరంగల్ జిల్లాలో మరో షాక్ తగలబోతోంది.. తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ ముఖ్యనేత ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు.

ఈ నెల 7వ తేదీన ఆయన టీఆర్ఎస్ కు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఎర్రబెల్లి ప్రదీప్ రావు వరంగల్ లో తూర్పు నియోజకవర్గాన్ని అశిస్తున్నారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. అనంతరం ఆయన టీఆర్ఎస్ లో చేరారు. 2018లో టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించినా ఆయనకు అవకాశం రాలేదు.

రేపు వరంగల్‌లో తన ముఖ్య అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. ఇప్పటికిప్పుడు ఏ పార్టీలో చేరాలనే దానిపై ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా ఉన్న సమయంలో సోదరుడు పార్టీని వీడటం కొంత వ్యక్తిగత నష్టమని దయాకర్ రావు చెబుతున్నారు.

కాగా.. గతంలో టీఆర్ఎస్ లోకి భారీగా వలసలు కొనసాగగా ఇప్పుడు ఆ పార్టీలోంచి ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీల్లోకి వలసలు ప్రారంభమయ్యాయి. భవిష్యత్ లో టీఆర్ఎస్ నుండి భారీగా వలసలు వుంటాయన్న బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్న సమయంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. 

రాజీనామా ప్రకటన అనంతరం రాజయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంనుండి టీఆర్ఎస్ లో పనిచేస్తున్నానని తెలిపారు. ఇలా దాదాపు 22ఏళ్ల పాటు పార్టీకి సేవలందించినా తగిన గుర్తింపు లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేసారు. పదవులు, ప్రాణం లేకున్నా ఆత్మగౌరవమే ముఖ్యమని భావించి టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు రాజయ్య యాదవ్ తెలిపారు. ఇంతకాలం పార్టీలో తాను అనుభవించిన బాధ నుండి విముక్తి పొందుతున్నానని తెలిపారు.

Related posts