telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈసీ అధికారుల పై కుమారస్వామి ఆగ్రహం

CM Kumaraswamy killing order

తనను ఎన్నికల సంఘం అధికారుల పై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం తననే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళుతున్న సమయంలో సీఎం కుమారస్వామి కాన్వాయ్‌ను ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీ చేసిన సంగతి తెలిసిందే.

తన అన్న హెచ్‌డీ రేవణ్ణ కొడుకు ప్రజ్వల్‌ రేవణ్ణ తరఫున ప్రచారం నిర్వహించేందుకు హసన్‌ ప్రాంతానికి సీఎం కుమారస్వామి కాన్వాయ్‌ వెళుతుండగా చెన్నరాయపట్న చెక్‌పోస్ట్‌ వద్ద సీఎం కాన్వాయ్‌ వాహనాలను ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏమీ లభించలేదు. తనను ఎన్నికల సంఘం టార్గెట్‌గా చేసిందని, తన పార్టీ నేతలను ఎన్నికల సిబ్బంది ఎన్నికల సిబ్బంది వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Related posts