telugu navyamedia
తెలంగాణ వార్తలు

నిరుద్యోగులతో చెలగాటం వద్దు..

ఉద్యమించి ప్రాణాలను త్యాగంచేసి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగ యువత ఉపాధికోసం ఎదురుచూస్తోందని, ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎన్నాళ్లు నిరీక్షించాలని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడితే వచ్చే ఎన్నికల్లో మంచి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఆయన చేపట్టిన నిరుద్యోగ దీక్షను విరమించారు. తన దీక్షతో నిరుద్యోగుల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు. జనవరిలో జాబ్ నోటిఫికేషన్ విడుదలచేయకుంటే… తెలంగాణ శాసన సభ సమావేశాలు నిర్వహించే సమయంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

CM KCR: “It is not bending the necks .. we will sit ..” CM is angry with Bandi Sanjay .. Warning to Kishan Reddy | CM KCR Slams Telangana BJP President Bandi Sanjay | pipanews.com

సభలో ఎమ్మెల్యేలు, సభ వెలుపల బీజేపీ శ్రేణులు నిరుద్యోగులతో కలసి సభను అడ్డుకుంటామన్నారు. నిరుద్యోగదీక్ష చేపట్టిన నేపథ్యంలో కేసీఆర్ సర్కారుకు వణుకు పుట్టించిందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లకోసం నిరుద్యోగ తమ్ముళ్లు ఎదురుచూస్తున్న తీరు, డిగ్రీలు చదివి కుటుంబాలకు భారంగాకుండా… టీకొట్లు, కూరగాయలు అమ్ముకుంటూ బతుకు బండిని నడిపిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావనకు తెచ్చారు. ఉద్యోగాలకోసం విద్యావంతులు ఎదురుచూస్తుంటే… మరోవైపు మిషన్ భగీరథ పథకంలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నవారిని తొలగించారని ఆవేదన వ్యక్తంచేశారు.

Related posts