ప్రపంచ బ్యాడ్మింటన్ విజేత పీవీ సింధు నేటి యువతరానికి సింధు రోల్‌మోడల్‌గా నిలిచిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. శనివారం పివి సింధు తన తల్లిదండ్రులతో కలిసి వెంకయ్యనాయుడును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. తాను గెలిచిన స్వర్ణ పతకాన్ని ఆయనకు చూపించడంతో పాటు ఓ బ్యాడ్మింటన్ రాకెట్ ను ఆయనకు బహూకరించింది.
ఈసందర్భంగా సింధును అభినందించిన వెంకయ్య పివి సింధు భారతజాతికే గర్వకారణమని కొనియాడారు. ఆమె లాంటి అథ్లెట్లు యువతకు స్ఫూర్తిప్రదాతలని వెంకయ్య పేర్కొన్నారు. ఆమె హార్డ్‌వర్క్, అంకితభావం ఎంతోగొప్పవని ప్రశంసించారు. దేశంలోని యువతరానికందరికీ సింధు ఒకస్పూర్తిగా నిలిచిందన్నారు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ సాధించినమొదటి మహిళాక్రీడాకారిణిగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు.