telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

తెలంగాణ ఇంటర్ బోర్డు వివాదంపై కార్యదర్శి వివరణ

inter board telangana

తెలంగాణ ఇంటర్మిడియట్ ఫలితాల్లో జరిగిన తప్పిదాలపై ఇంటర్ బోర్డు కార్యదర్శి సోమవారం మీడియా ముందు వివరణ ఇచ్చారు. ఎగ్జామినర్ చేసిన పొరపాటు కారణంగా ఈ సమస్య వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఓఎంఆర్ బబ్లింగ్‌లో ఎగ్జామినర్ పొరపాటు చేశారు. ఎగ్జామినర్ చేసిన పొరపాటు కారణంగా ఈ సమస్య వచ్చిందన్నారు. 21 వేల జవాబు పత్రాలు గల్లంతైన మాట అవాస్తవమని తెలిపారు.

జవాబు పత్రాలు పోలీసు కస్టడీలో భద్రంగానే ఉన్నాయని, అవకతవకలు జరిగాయని భావించిన వారికి జవాబు పత్రాలు ఇస్తామని వెల్లడించారు. జవాబు పత్రాలు చూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎగ్జామ్ సెంటర్ మారడం వల్ల కూడా కొన్ని సమస్యలు తలెత్తాయన్నారు. పరీక్షలు రాయని వాళ్లను పాస్ చేయడం జరగదుని అశోక్ స్పష్టం చేశారు.తప్పలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Related posts