telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

పడిపోయిన టొమాటో ధర..రైతుల ఆందోళన

tamata market

రెండు నెలల క్రితం రిటైల్‌ మార్కెట్‌లో కిలో టొమాటో రూ.50 నుంచి రూ.60 వరకు పలికింది. దీంతో సామాన్యుడు కొనలేని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం టొమాటో దిగుమతి పెరగడంతో, మార్కెట్లోకి లారీల కొద్దీ వచ్చేస్తోంది. దీంతో ఒక్కసారిగా టొమాటో ధరలు భారీగా పడిపోయాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో టొమాటో రూ.5 నుంచి రూ.8కి, రిటైల్‌ మార్కెట్‌లో కిలో టొమాటో రూ.10 నుంచి రూ.15కే లభిస్తోంది.టొమాటో ధరలు పడిపోవడంతో తమకు కనీసం రవాణా చార్జీలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లోని మోండా మార్కెట్‌, ఎల్బీనగర్‌ మార్కెట్‌, గుడి మల్కాపూర్‌ వంటి ప్రధాన మార్కెట్లు, రైతుబజార్లలో టొమాటో దిగుమతి అధికంగా ఉంది.

Related posts