కొద్ది రోజుల్లో స్టార్టవబోతున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే రోజున బ్లౌ పంక్ట్ సంస్థ కేవలం ఆరువేల రూపాయలకే స్మార్ట్ టీవీని అందించేందుకు సిద్ధం అయ్యింది. ఈ-కామర్స్ సంస్థలు ఎప్పుడు ఏదో కొత్త ఆఫర్ల పేరు చెప్పి, వినియోగదారుడికి దగ్గరవుతూనే ఉన్నాయి. ఆ తరహాలోనే ఈ సారి ఈ టీవీ ఆఫర్ కొనుగోళ్లపై బాగా ప్రభావం చూపనుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటివరకు మార్కెట్ లో ఎవరు కూడా ఆరువేలకే స్మార్ట్ టీవీ అందించిన దాఖలాలు లేవు. అందువలన ఈ సేల్ బాగా ప్రాచుర్యాన్ని సంతరించుకోనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న వారు మాత్రం దీనితో డి.టి.హెచ్ కూడా ఆఫర్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని వారి ఆలోచనను పంచుకుంటున్నారు. అయితే ఈ సేల్ లో ఏవి ఎన్ని మిగిలినా.. ఈ టీవీలు మాత్రం త్వరగా అమ్ముడుకానున్నాయనేది వినియోగదారుల ఆసక్తిని చూస్తేనే తెలుస్తుంది.
పారదర్శక పాలన అందించేందుకు జగన్ కృషి