భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా సాధారణ జీవన శైలి అతలాకుతలం అవుతుంది. దానికితోడు విషజ్వరాలు..ప్రజలను ఊపిరిపీల్చుకోనివ్వకుండా ఇబ్బందిపెడుతూనే ఉన్నాయి. అయితే ఎన్నో ఆరోగ్య పథకాలు ఉన్నప్పటికీ, ఈ పరిస్థితులకు అనువుగా చేసుకొంటూ ఓ సంస్థ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఒక్క దోమ కాటుకు ప్రాణాలే పోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ వినూత్నమైన ఇన్సురెన్స్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘మస్కిటో డిసీస్ ప్రొటెక్షన్ పాలసీ’ పేరుతో దోమల వల్ల వచ్చే ‘డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా, జపనీస్ ఎన్సెఫాలటిస్, కాలా అజర్, లింఫటిక్ ఫిలేరియాసిస్, జికా వైరస్’ వంటి ఏడురకాల వ్యాధులకు బీమా సౌకర్యం కల్పిస్తోంది.
దీనికోసం ఏడాదికి 99 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి ఈఆర్‌జీవోతో ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ ఒప్పందం చేసుకుంది. వలసలు వెళ్లే వాళ్లు, రోజూవారీ కూలీలు, వ్యక్తి ఆధారిత కుటుంబాల కోసం ఈ పాలసీని తెచ్చామని ఎయిర్‌టెల్ ప్రతినిధులు చెబుతున్నారు. సీజనల్ వ్యాధుల వల్ల జీతాలు కోల్పోయేవాళ్లు చాలా మంది ఉంటారని.. అటు జీతం రాక, ఇటు హాస్పిటల్ ఖర్చులతో సతమతమవుతుంటారని.. అలాంటి వారికి ఈ పథకం ప్రయోజకరంగా ఉంటుందని తెలిపారు.
తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకొస్తా : షర్మిల