telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో 1,93,600 కు చేరిన కరోనా కేసులు

Corona

తెలంగాణ‌లో కరోనా వైయరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. కోవిడ్ కేసుల తాజా వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,214 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,474 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,93,600 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,63,407 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,135 కు చేరింది. ప్రస్తుతం 29,058 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 305 మంది కోవిడ్ బారినపడ్డారు.

Related posts