telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌ పాతబస్తీలో మెట్రో: మంత్రి కేటీఆర్‌

ktr trs president

హైదరాబాద్‌ పాతబస్తీలో తప్పకుండా మెట్రో రైలు వస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మంత్రి కేటీఆర్‌ చిట్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ.. తమకు ఇప్పటికీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే అన్నారు. బీజేపీ తాను చిన్నప్పుడు ఎలా ఉందో… ఇప్పుడు అలాగే ఉందని తెలిపారు. ఎంఐఎం పార్టీతో స్నేహ సంబంధాలు ఉంటాయన్నారు. ఎన్నికలల్లో ఎంఐఎంతో కలిసి పోటీచేసే ప్రసక్తే లేదన్నారు.

కేంద్రం సాయం చేయకపోయినా ఐటీలో హైదరాబాద్‌ అగ్రస్థానంలోనే కొనసాగుతుందన్నారు. ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీపై నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. ఈ నెల 3న ముంబయిలో జరిగే ఫార్మా సదస్సుకు హాజరుకానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఫార్మా సిటీని ప్రారంభించనున్నట్లు చెప్పారు.

Related posts