telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వాల్మీకి గొప్ప కావ్యాన్ని రచించారు: సీఎం జగన్

jagan

నేడు వాల్మీకి జయంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. రామాయణ మహాకావ్యాన్ని మానవాళికి అందించిన మహనీయుడు వాల్మీకి అని కొనియాడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం జగన్ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నతమైన ఆదర్శాలను, మానవతా విలువలను రామాయణం అడుగడుగునా మనకు బోధిస్తుందని తెలిపారు. వాల్మీకి గొప్ప కావ్యాన్ని రచించారంటూ కొనియాడారు. రామకావ్యం వెలుగుల్లో మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని జగన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Related posts