telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్ట్

Nimmala_Rama_Naidu_ tdp

ఇసుక ఇబ్బందులపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనకు పిలుపు ఇచ్చినే నేపథ్యంలో ముందస్తు చర్యగా పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇందులోభాగంగా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నివాసంవద్ద తెల్లవారుజామున పోలీసులు మోహరించారు. అనంతరం ఆయనను నరసాపురం తీసుకువెళుతున్నట్టు చెప్పారు.

అయితే చించినాడ మీదుగా తూర్పుగోదావరి తరలించారు. ఎమ్మెల్యే నిమ్మల స్వచ్ఛందంగా తాను వస్తానని చెబుతున్నప్పటికీ పోలీసులు దౌర్జన్యంగా లాక్కెళ్లారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే రాష్ట్రంలోని టీడీపీ శ్రేణులు అందర్నీ హౌస్ అరెస్టుచేసి కేవలం పాలకొల్లు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి బయటకు తీసుకు వెళ్లడంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

Related posts