దేశంలో ఎన్నికలకు నగారా మోగినప్పటి నుండి ద్రుష్టి అంతా ఒక్క ఏపీ పైనే ఉంది. ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీల మధ్య పోటీ అంతతీవ్రంగా ఉంది. ఎవరు గెలుస్తారో అనేది ఆసక్తిగా మారింది. దీనితో ఈ రాష్ట్రంపై అనేక సర్వేలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు.. తెలుగు రాష్ట్రాల్లో ఇదో మిలియన్ డాలర్ ప్రశ్న. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారా.. లేక.. ఈసారైనా ముఖ్యమంత్రి కావాలన్న జగన్ కోరిక నెరవేరుతుందా.. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు సీఎం అవుతారో తేల్చేందుకు ‘ప్రికి న్యూస్’ అనే సంస్థ డిటైల్డ్ సర్వే నిర్వహించింది.
ప్రతి జిల్లాలోనూ శాంపిల్స్ తీసుకుని సర్వే నిర్వహించినట్టు ఆ సర్వే నిర్వాహకులు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ నియోజకవర్గాల వారీగా ప్రజల ఓటింగ్ శాతాన్ని కూడా ఈ సర్వే చెబుతోంది.
ఈ సర్వే ప్రకారం..జిల్లాల వారీ వివరాలు చూస్తే..
శ్రీకాకుళం(10) జిల్లాలో వైసీపీకి 6 సీట్లు.. టీడీపీకి 3 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ జిల్లాలో జనసేన పాలకొండలో ముందంజలో ఉంది.
విజయనగరం(09) జిల్లాలో వైసీపీకి 8 సీట్లు.. టీడీపీకి 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
విశాఖ(15) జిల్లాలో వైసీపీకి 7 సీట్లు.. టీడీపీకి 4 సీట్లు.. జనసేనకు 4 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ గాజువాకలో గెలుస్తారు.
తూర్పు గోదావరి(19) జిల్లాలో.. జిల్లాలో వైసీపీకి 12 సీట్లు.. టీడీపీకి 3 సీట్లు వచ్చే అవకాశం ఉంది. జనసేనకు 4 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది.
పశ్చిమ గోదావరి(15) జిల్లాలో..జిల్లాలో వైసీపీకి 9 సీట్లు.. 4టీడీపీకి సీట్లు వచ్చే అవకాశం ఉంది. జనసేనకు 2 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉంది. భీమవరంలో పవన్ కల్యాణ్ గెలిచే అవకాశం ఉంది.
కృష్ణా(16) జిల్లాలో జిల్లాలో వైసీపీకి 9 సీట్లు.. టీడీపీకి 7 సీట్లు వచ్చే అవకాశం ఉంది. జనసేన ఖాతా తెరిచే ఛాన్స్ లేదు.
గుంటూరు(17) జిల్లాలో వైసీపీకి 10 సీట్లు.. టీడీపీకి 7 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ జిల్లాలో నారా లోకేశ్‌కు ఓటమి తప్పదని సర్వే అంచనా వేసింది.
ప్రకాశం(12) జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయనుంది.. మొత్తం 12 నియోజకవర్గాలూ ఆ పార్టీనే గెలుచుకుంటుంది. టీడీపీ, జనసేన ఖాతా తెరిచే ఛాన్సు లేదు.
నెల్లూరు(10) జిల్లాలో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేయనుంది.. మొత్తం నియోజకవర్గాలు ఆ పార్టీనే గెలుచుకుంటుంది. టీడీపీ, జనసేన ఖాతా తెరిచే ఛాన్సు లేదు.
కర్నూలు(14) జిల్లాలో టీడీపీకి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. మిగిలినవన్నీ వైసీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి.
అనంతపురం(14) జిల్లాలో టీడీపీకి 6 స్థానాలు.. వైసీపీ 8 స్థానాలు దక్కించుకోనున్నాయి.
కడప(10) జిల్లాలో ఒక్క జమ్మలమడుగు తప్ప అన్ని స్థానాల్లోనూ వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది. జగన్ పులివెందులలో గెలుస్తారు.
చిత్తూరు(14) జిల్లా విషయానికి వస్తే.. టీడీపీకి రెండు, వైసీపీకి 12 స్థానాలు దక్కనున్నాయి. చంద్రబాబు కుప్పంలో గెలుస్తారు.
ఓవరాల్‌గా తీసుకుంటే.. తెలుగుదేశానికి 44 స్థానాలు, వైసీపీకి 124 స్థానాలు, జనసేనకు 11 స్థానాలు దక్కనున్నాయి. మొత్తం మీద జగన్ సీఎం కావడం తథ్యం అని ఈ సర్వే చెబుతోంది.