మాజీ మంత్రి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర ఇసుక కొరతను నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ శ్రేణులతో కలిసి ఈరోజు ఉదయం ఆయన ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక కొరత సృష్టించి పేదలకు పనుల్లేకుండా చేసి వారి పొట్టకొట్టారని అన్నారు. పేదల రాజ్యాన్ని సీఎం జగన్ పులివెందులగా మార్చేశారని ధ్వజమెత్తారు.
స్థానిక పాతబస్టాండ్ వద్ద మూతపడిన అన్న క్యాంటీన్ ఎదుట బైఠాయించిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. ధర్నాలో పాల్గొన్న పలువురు నిర్మాణ రంగ కూలీలు ఇసుక కొరత వల్ల పనులు నిలిచిపోయి ఉపాధి లేక తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు.
తల్చుకుంటే మీ కంటే పదింతలు చెయ్యగలను..పరిధులు దాటవద్దు