telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఉప్పెన’ తమిళ రీమేక్.. హీరో…?

Uppena

మాములుగా ఏ భాషలోనైనా సినిమా హిట్ అయితే దానిని వివిధ భాషలోకి రీమేక్ చేస్తారు. అయితే ఈ మధ్య తెలుగు సినిమాలు యువగా రీమేక్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం మోస్ట్ ఎవైటింగ్ లవ్ స్టోరీ ‘ఉప్పెన’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కొల్లగొడుతోంది. ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన బుచ్చి బాబు ప్రేక్షకులను మెప్పించాడు. బేబమ్మ పాత్రతో కృతి శెట్టి ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో హీరోయిన్‌గా మెప్పించి యూత్‌ని ఎట్రాక్ట్ చేసింది. ఇక పవర్‌ఫుల్ క్యారెక్టర్ లో విజయ్ సేతుపతి తన విలనిజంతో సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతంతో మెప్పించాడు. ఉప్పెనంత విజయంతో కోలీవుడ్ కూడా ఈ చిత్రంపై కన్నేసింది. ‘ఉప్పెన’ తమిళ రీమేక్ లో సూపర్ స్టార్ విజయ్ తన తనయుడు సంజయ్ ను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నాడట. ఇప్పటికే నిర్మాతలతో రీమేక్ హక్కుల విషయంలో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి అక్కడ ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.

Related posts