telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

ఆ ముగ్గురు ఎమ్మెల్సీ లు .. వీళ్లే ..

kcr three nominated mlc's

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్థానిక సంస్థల కోటా శాసనమండలి స్థానాల్లో పోటీచేసే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ఖరారుచేశారు. వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ నుంచి తేరా చిన్నపురెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ మేరకు ముగ్గురు అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బీఫారాలను అందజేశారు. జిల్లాల నాయకులతో సమన్వయంతో పనిచేసి, ఎన్నికల్లో విజయం సాధించాలని వారికి సూచించారు. నాయకులను సమన్వయం చేసే బాధ్యతను మంత్రులకు అప్పగించారు. అనంతరం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామా రావు ఎమ్మెల్సీ అభ్యర్థులు, మంత్రులు, ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. పార్టీ అభ్యర్థులు గెలువడానికి అవసరమైన మెజారిటీ స్పష్టంగా ఉన్నదని తెలిపారు.

టీఆర్‌ఎస్‌కు చెందినవారే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో అధికశాతం మంది ఉన్నందున ప్రతిపక్షాలు కూడా అభ్యర్థులను బరిలో దింపడానికి వెనకంజవేయవచ్చని అంచనా వేశారు. దీని తో దాదాపుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నదని సమాచారం. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, బండప్రకాశ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎం శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్ రాజు, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌రెడ్డి తదితరులున్నారు.

రేపటితో(మంగళవారం) మూడు ఎమ్మెల్సీస్థానాల ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు ముగియనున్నది. 17న నామినేషన్ల ఉపసంహరణకు గడువు. పోలింగ్ అనివార్యమైతే మే 31న నిర్వహించనున్నారు. జూన్ 3న ఓట్లను లెక్కిస్తారు. దీనికోసం అభ్యర్థులుగా రోడ్‌షోల ఇంచార్జి పోచంపల్లి, ఫార్మా అధినేత చిన్నపురెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి లను కేసీఆర్ ఖరారు చేశాడు.

Related posts