బిహార్ ఎన్నికల ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మరోసారి సత్తాచాటింది. అయితే.. ఇప్పుడు స్పీకర్ ఎన్నిక బీహార్ రాజకీయంలో కాక పుట్టస్తోంది. జైలులో ఉన్న ఆర్జేడీ అధినేత నుంచే యాక్టివ్ అయిపోయారు. ఏకంగా బీజేపీ నేతలకు ఫోన్లు కూడా చేశారు. స్పీకర్ ఎన్నికకు దూరంగా ఉండాలని.. ఆర్జేడీకి మద్దతు ఇవ్వాలని లాలూ బీజేపీ ఎమ్మెల్యేలను కోరారు. ఆ ఆడియో టేపులను బీజేపీ బయటపెట్టింది. లాలూ ప్రసాద్ వేస్తున్న ఎత్తులు ఏవీ కూడా సఫలం కావని తెగేసి చెబుతోంది. ఇదే విషయంపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. లాలూ ప్రసాద్ జైలు నుంచే తమ ప్రభుత్వాన్ని కూల దోయాలని చూస్తున్నారని ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి నితీష్ ప్రభుత్వాన్ని లూలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని ట్వీట్ చేశారు. ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి… మహాఘట్ బంధన్‌కు సహాయ పడాలని లాలూ ప్రసాద్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు సుశీల్.