telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

రైతులకు గుడ్‌ న్యూస్‌.. ఆగస్టు 16 నుండి ‘రుణ మాఫీ’

తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు శుభావార్త చెప్పింది. రాష్ట్రంలో ఈ నెల (ఆగ‌స్టు) 16 నుండి రైతుల ఖాతాలో రుణ‌మాఫీ న‌గ‌దు మొత్తం జ‌మ‌కానుంది. రూ.50 వేల వ‌ర‌కు రైతు రుణాల‌ను మాఫీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ఇటీవ‌లే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు, వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి న‌గ‌రంలోని బీఆర్‌కేఆర్ భ‌వ‌న్‌లో బ్యాంక‌ర్ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. 42 బ్యాంకుల అధికారులు భేటీకి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రూ. 50 వేల లోపు రైతు రుణ మాఫీపై క్యాబినెట్ సమావేశంలో సీఎం ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. ఆగష్టు 15 వ తేదీన సీఎం కేసీఆర్ లాంఛనంగా రూ. 50 వేల‌లోపు రైతు రుణాల మాఫీ ప్రకటిస్తారు. 16వ తేదీ నుంచి లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో జమకానుంది… రాష్ట్రంలోని ఆరు లక్షల మంది రైతు ఖాతాల్లోకి రూ.2006 కోట్ల రుణ మాఫీ డబ్బులు జమ చేయనున్నారు. బ్యాంకర్లు రుణ మాఫీ మొత్తాన్ని ఏ ఇతర ఖాతా కింద జమ చేయొద్దని… పూర్తిగా రుణా మాఫీ ఖాతాలోనే ఈ మొత్తాన్ని జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం… రుణ మాఫీ జరిగిన రైతుల ఖాతాల్లో జీరో చేసి కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.

Related posts