telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆస్ట్రేలియాను ముంచెత్తుతున్న.. వరదలు…

floods in Australia due to heavy rains

ఆస్ట్రేలియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా టౌన్స్‌విల్లే నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో టౌన్స్‌విల్లే జలదిగ్బంధమయ్యింది. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. స్థానికులు దిక్కుతోచని పరిస్థితిలో పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

ఇదే తరహాలో, మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. టౌన్స్‌విల్లేకు సమీపంలో ఉన్న క్వీన్స్‌లాండ్‌కు వరదముప్పు పొంచి ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేశారు.వరదలలోను సహాయక చర్యలు కొనసాగుతూనే ఉండటం గమనార్షం.

Related posts