telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా టెన్షన్ : మార్చి 31 వరకు స్కూళ్లు బంద్‌…

collector sudden visit to schools in

చైనా నుండి వచ్చిన కరోనా మన దేశంలో దాదాపు ఏడాదికి పైగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది . అయితే ఆ మధ్య కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి.  ముఖ్యంగా ఈ కరోనా తీవ్రత మహారాష్ట్ర, కేరళ, గుజరాత్‌,పంజాబ్‌ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే.. కరోనా తీవ్రత ఎక్కువ నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఈనెల 31 వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు మినహా అన్ని విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. వైరస్‌ ఎక్కువగా ఉన్న 11 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ మరో 2 గంటలు పొడిగించింది. రానున్న 2 వారాలు ప్రజలు ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం సూచించింది.   కాగా..దేశంలో 1.15 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 39,726 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 154 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 20,654 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,14,331 కాగా ….దేశ వ్యాప్తం గా యాక్టీవ్ కేసులు 2,71,282 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,10,83,679 కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,59,370 నమోదైంది. 

Related posts