telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

బిగ్ బాస్ కోసం.. 200కోట్ల పారితోషకం.. ఎవరికో తెలుసా..

salman khan getting 200cr remuniration from

బిగ్‌ బాస్‌ సీజన్‌-13 షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నందుకు గాను సల్మాన్‌ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఆయన తీసుకునే పారితోషికం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోవలసిందే. ఎందుకంటే బాలీవుడ్లో బిగ్ బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ఇంటింటా వ్యాపించింది, దీనికంతటికి కారణం సల్మాన్ ఖాన్ నేనట. ఈయన వారానికి రెండు సార్లు వచ్చి పలకరిస్తే చాలు రేటింగ్స్ అదిరిపోతున్నాయట. ఇకపోతే ఈ బిగ్‌ బాస్‌ షో ఒకటి రెండు కాదు ఏకంగా ఇప్పటివరకు 12 సీజన్స్ పూర్తి చేసుకుని 13వ సీజన్‌కు సిద్ధమవుతుంది. ఈ షో కోసం సల్మాన్ ఖాన్ తీసుకుంటున్న పారితోషికం సంచలనంగా మారింది. ఈ షో కోసం ఆయన ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

సల్మాన్‌ఖాన్ బిగ్‌బాస్‌ సీజన్‌4 నుంచి ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌కుగాను సల్మాన్‌కు వారానికి 13 కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నారట. అయితే ఇటీవల ఆ షోను మరో ఐదు వారాలపాటు పొడిగించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఎపిసోడ్‌కు 2 కోట్ల రూపాయల చొప్పున రెమ్యూనరేషన్‌ను పెంచారట. మొత్తంగా ఈ సీజన్‌ ద్వారా సల్మాన్‌కు 200 కోట్ల రూపాయల పారితోషికంగా దక్కనుందని సినివర్గాల ద్వారా తెలుస్తుంది. ఆయన్ని కాకుండా మరో హీరోను తీసుకుంటే షోకు ఉన్న పాపులారిటీ ఎక్కడ తగ్గిపోతుందో అని భయపడుతున్నారు షో నిర్వాహకులు. అందుకే అంత అడుగుతున్నా కూడా ఏం మాట్లాడకుండా సై అనేస్తున్నారట.

Related posts