telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సంక్రాంతి బరిలో “వకీల్ సాబ్”…?

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగు పార్టు పూర్తి కావాల్సింది. కానీ లాక్ డాన్ కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. పవన్ కల్యాణ్ పోర్షన్ కి సంబంధించి 20 రోజుల చిత్రీకరణ మిగిలివుంది. ఇతర పాత్రల కాంబినేషన్లో మరో 20 రోజుల చిత్రీకరణ చేయవలసి వుంది. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత తిరిగి షూటింగును ఆరంభిస్తే, ఆగస్టులో షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు. అయితే దసరా, దీపావళి, క్రిస్మస్ పర్వదినాల్లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచన ‘దిల్’ రాజుకి లేదని చెబుతున్నారు. ఆయన ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపాలని భావిస్తున్నాడట. సంక్రాంతికి ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చాడని అంటున్నారు. ఒకవేళ ముందుగా చెప్పినట్టే ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతికి వస్తే అప్పుడు ఆలోచించవచ్చని భావిస్తున్నారట ‘దిల్’ రాజు.

Related posts