ప్రస్తుతం భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్న ఆర్మీ హాస్పిటల్ వైద్యులు.. మరిన్ని వైద్య పరీక్షల కోసం ఆయనను ఎయిమ్స్‌కు సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు.. రాంనాథ్ కోవింద్ స్వల్ప అనారోగ్యానికి గురై శుక్రవారం రోజు రాష్ట్రపతి కోవింద్.. ఢిల్లీలోని ఆర్‌అండ్‌ఆర్ హాస్పిటల్‌లో చేరారు.. ఆయనకు సాధారణ పరీక్షలు చేసి పర్యవేక్షణలో ఉంచారు వైద్యులు.. ఇక, ఆస్పత్రిలో ఉన్న రాష్ట్రపతిని కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించగా.. రాష్ట్రపతి కుమారుడి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మరోవైపు.. రామ్‌నాత్ కోవింద్‌ను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు వైద్యులు.. మరిన్ని పరీక్షలు, పర్యవేక్షణ తర్వాత ఈ నెల 30న ఆయనకు బైపాస్ నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని రాష్ట్రపతి కార్యాలయం కూడా ప్రకటించింది. అయితే చూడాలి మరి ఆయన ఎప్పటికి డిశ్చార్జ్ అయి తిరిగి వస్తారు అనేది.
previous post
next post