telugu navyamedia
సినిమా వార్తలు

దర్శకుడు వివి వినాయక్ భవనాన్ని కూల్చివేసిన జీహెచ్ఎంసీ

VV-Vinayak

దర్శకుడు వివి. వినాయక్‌కు జీహెచ్ఎంసీ అధికారులు వట్టినాగులపల్లిలో ఆయన నిర్మించుకుంటున్న భవనాన్ని అనుమతి లేదంటూ కూల్చివేసి షాక్ ఇచ్చినట్లు సమాచారం. అనుమతి లేకుండా అక్రమ భవన నిర్మాణాల కారణంగా అధికారులు దర్శకుడిపై సీరియస్ అయినట్లు సమాచారం. గండిపేట పరిధిలో ఉన్న వట్టినాగుల పల్లి కొత్త జిల్లాలు ఏర్పడకముందు గ్రామ పంచాయితీలో ఉండేది. జిల్లాల ఏర్పాటు అనంతరం జీహెచ్ఎంసీ ఆధీనంలోకి వచ్చింది. దీంతో ఈ ప్రాంతం పూర్తిగా త్రిపుల్ వన్ జీవో పరిధిలోకి వస్తోంది. ఇక్కడ జీ+2 మాత్రమే నిర్మించాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు అనుమతించరు. ఈ జీవో ప్రకారం జీహెచ్ఎంసీ అధికారులు వివి.వినాయక్ భవనంపై చర్యలు తీసుకున్నారు. 111 జీవోకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని వివి. వినాయక్‌కు అధికారులు నోటిసులు జారీ చేశారు. వివి. వినాయక్ నుంచి స్పందనరాకపోవడంతో నాలుగు అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు.

Related posts