జబర్దస్త్ కమెడియన్ రాం ప్రసాద్ తన ఆటో పంచులతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే కొన్ని రోజులుగా.. ఆటో రాంప్రసాద్ సోషల్ మీడియా ద్వారా సినిమాల్లో.. ఛాన్సులు ఇప్పిస్తానంటూ అమ్మాయిలకు వల వేస్తున్నాడని పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా రాంప్రసాద్ ఓ వీడియోను విడుదల చేశాడు. ఈ సందర్భంగా ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు. నా పేరిట సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి కొందరు.. అమ్మాయిలకు ఫోన్లు, మెసేజ్‌లు చేసి వారి ఫొటోలను అడుగుతున్నారట. అలాంటి వాళ్లను నమ్మకండి. నాకు కేవలం ఫేస్‌బుక్‌లో మాత్రమే అధికారికంగా అకౌంట్ ఉంది. ఏ అప్‌డేట్ ఇవ్వాలన్నా అందులోనే ఇస్తానని పేర్కొన్నాడు రాంప్రసాద్. నేను ఎవరికీ ఫోన్ చేయలేదు. కొంతమంది కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను అడిగానని కొందరు అమ్మాయిల ఫొటోలు తీసుకుంటున్నారు. కానీ అవి అడిగింది నేను కాదు. అయినా నాకు ఫేస్‌బుక్‌లో ఐడీ లేదు. ఫేస్‌బుక్ పేజ్ మాత్రమే ఉంది. కొంత మంది నా ఫేక్ ఐడీతో మోసం చేస్తున్నారట. ఆ విషయం నా వరకూ వచ్చింది. అందుకే ఈ వీడియో చేశానని పేర్కొన్నాడు. ఎవరైనా అమ్మాయిల ఫొటోలు అడిగితే వెంటనే పంపించకండి. కాస్త ఆలోచించండి అంటూ వీడియోలో వివరణ ఇచ్చాడు రాంప్రసాద్.
previous post