telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఉద్యోగి వేధింపులతో యజమాని ఆత్మహత్య…

suicide

ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి వేధింపులతో కంపెనీ యజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఉద్యోగి చేసిన పనికి కంపెనీ యజమాని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. సింగపూర్ లో రిపోర్ట్ గార్డెన్ కంపెనీ యజమాని అశోక్ వర్మ ఆత్మహత్య పాల్పడినట్లు ఆయన సోదరుడి ద్వారా పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళ్తే రిపోర్ట్ గార్డెన్ కంపెనీ యజమాని అశోక్ వర్మ తన కంపెనీలో నే పని చేస్తున్న ఉద్యోగి హుస్సేన్ నిర్వాకంతో కోట్ల రూపాయల నష్టం చవి చూశాడు అశోక్ వర్మ. తన వద్ద పని చేస్తున్న హుస్సేన్ నిర్వాకంతో కంపెనీని  అమ్మకానికి పెట్టాడు అశోక్ వర్మ. ఉద్యోగం పోతుందని భావించిన హుస్సేన్ కంపెనీ డేటాని దొంగిలించిన హుస్సేన్ కంపెనీ వివరాలను ఫేక్ ఈ మేయిల్స్, పాత ఉద్యోగస్తుల పేరుతో కొనుక్కునే వాళ్ళకి మెయిల్స్ పంపించాడు హుస్సేన్. ఈ వ్యవహారంతో మళ్ళీ కోట్ల రూపాయలు నష్ట పోయిన యజమాని అశోక్ వర్మ ఆర్థిక భారం, ఉద్యోగి నమ్మక ద్రోహం తట్టుకోలేక సింగపూర్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అశోక్ వర్మ సోదరుడు సుధీర్ వర్మ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి ఐపి అడ్రస్ ఆధారంగా హుస్సేన్ ను అరెస్టు చేశారు పోలీసులు . 

Related posts