telugu navyamedia
సినిమా వార్తలు

బ్రహ్మానందం ఆరోగ్యంపై అప్డేట్

Heart attack to Comedian Brahmanandam
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు ఇటీవల ముంబైలోని ఓ ఆసుపత్రిలో హార్ట్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ముంబై నుంచి ఆయన హైదరాబాద్ రాగానే టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా ఆయనను వ్యక్తిగతంగా కలిసి పలకరించారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న బ్రహ్మానందం త్వరలోనే ఓ కొత్త సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. తనకు పనే ఎనర్జీ ఇస్తుందని భావిస్తున్నారంట బ్రహ్మానందం. బ్రహ్మానందం పూర్తిగా కోలుకున్నారని, త్వరలోనే సెట్స్ కు వచ్చేస్తున్నారని, వచ్చే నెలలో పప్రారంభమయ్యే ఓ చిత్రంలో ఆయన నటించబోతున్నారని ట్వీట్ ద్వారా వెల్లడించారు వెన్నెల కిషోర్. హాస్యలోకపు రారాజుగా వెలుగొందిన బ్రహ్మానందం వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డు పొందారు. ఆయనను 2009లో పద్మశ్రీ అవార్డు కూడా వరించింది. బ్రహ్మానందం త్వరలోనే మరెన్నో సినిమాలతో బిజీ అయ్యి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలని కోరుకుందాం. 

Related posts