telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దిశ ఘటనపై సల్మాన్ ఫైర్… మోడీ ప్రభుత్వానికి కౌంటర్

Salman-KHan

వెటర్నరీ వైద్యురాలి హత్య దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఆ నిందితులను ఉరి తియ్యాలంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు ఈ ఘటనపై స్పందించారు. తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఈ ఘటనపై సోషల్ మీడియాలో స్పందించారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందితులు మనుషుల మధ్య తిరుగుతున్న దరిద్రమైన దెయ్యాలంటూ సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అమాయక బాధితురాలు అనుభవించిన నరకం గురించి తెలుసుకున్నాం కాబట్టి మరో అమాయకురాలు బలి కాకముందే సమాజం అంతా ఐక్యమై ఇలాంటి దెయ్యాలను ఏరిపారేయాలని తెలిపారు. మరే కుటుంబం ఇలాంటి బాధను అనుభవించకూడదని పేర్కొన్నారు. బేటీ బచావో బేటీ పడావో అనేది కేవలం ఓ క్యాంపెయిన్ మాత్రమే కాకూడదని దానిని ఆచరణలోనూ పెట్టాలని ఇన్‌డైరెక్ట్‌గా మోదీ ప్రభుత్వానికి కౌంటర్ వేశారు. మనమంతా ఒకటిగా ఉన్నామని ఇలాంటి రాక్షసులకు తెలిసి రావాలని అన్నారు. వెటర్నరీ వైద్యురాలి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరి ఆ నలుగురికి కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుందో చూడాలి.

Related posts