telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

గాయ పడిన హృదయం…

నువ్విలా మోసం చేస్తావనుకొలేదు

నీ చెంత నుండగా నన్నో దేవుడనన్నావు

నీకంటే అందగత్తెలు లేరన్నావు

నీ కళ్ళు ఇలా విషం చిమ్ముతాయనుకోలేదు

 

ఈనాటి వరకు నిన్నో 

దేవతగా తలచాను

నమ్మించి మోసం చేసావు

నయవంచన చేసావు

 

ఉప్పెనలా వచ్చావు

ఊపిరిగా నిలిచావు

గుండెకు గాయం చేసి

ఉసరు తీసి పోయావు

 

నన్ను నడి సంద్రంలో ముంచావు

మనసు మనసులో లేదన్నావు

నన్ను కాదని వెళ్ళావు

తిరిగొచ్చి బికారిలా 

ఒట్టి చేతులతో ఎదుట నిలిచావు

 

ఏమిటీ మోసకారి తనం

ప్రేమంటూ వంచించావు

గుండెల్లో గునపంతో పొడిచావు

రుధిరం కళ్ళ చూసావు

 

ఎలా‌ నమ్మ గలను నిన్ను

నా మనసుకు నీవు చేసిన 

గాయం ఏనాటికి మరువ లేనిది

కల్మషం లేని హృదయంలో

రక్తం చవి చూశావు

 

    

Related posts