ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. మచిలీపట్నంలో ఉన్న ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఇళ్ళు కట్టే తాపీ తో దాడి చేశారని అంటున్నారు. ఈ క్రమంలో మంత్రి నాని తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారని అంటున్నారు. వెంటనే నిందితుడిని పట్టుకున్నఅనుచరులు ఆయన్ని పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో మంత్రి చొక్కా పూర్తిగా చినిగిపోయిందని అంటున్నారు. పోలీసులు నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే పేర్ని నాని పై దాడి తప్పకుండా కుట్రే అంటున్నారు మంత్రి పేర్ని అనుచరులు. దాడికి పాల్పడిన నాగేశ్వరరావు టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ సొదరుడంటున్నారు నాని అనుచరులు. కుట్రతోనే పేర్ని నాని పై దాడికి పాల్పడ్డాడని… గతంలో ఒకట్రెండు సందర్భాల్లో నాగేశ్వరరావును చూశామని తెలుపుతున్నారు. అయితే రెక్కి నిర్వహించి మరీ దాడి చేశారా అనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతుంది. దాడికి పాల్పడిన నాగేశ్వరరావుకు టీడీపీతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
previous post
జబర్దస్త్ తో గొప్పగా పేరు తెచ్చుకున్న రోజా.. రియల్ లైఫ్ లోనూ గొప్పగా నటిస్తోంది: నన్నపనేని