తెలుగులో తాళి, సంస్కృతంలో మంగళం. రెండూ కలిస్తే సూత్రం. అయితే పూర్వకాలంలో ధరించే మంగళసూత్రాన్ని తాళి అంటారు అని…ఇప్పుడు ధరించే తాళి మంగళసూత్రం కాదని అంటుంటారు. అలాంటి మంగళ సూత్రంలో కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి.
మంగళసూత్రం సాధారణంగా మూడుపోగుల దారం, మూడు వరుసలు కలుపుతారు. అలా తొమ్మిది. తొమ్మిది పోగుల్ని మూడు వరుసలు ఇలా ఇరవై ఏడు పోగులు అవుతుంది.
అలా స్త్రీ మెడలో వేసుకొనే దారం పోగులు ఇరవై ఏడు. ఇరవై ఏడు పోగుల దారానికి రెండు బిళ్లలు . ఆ బిళ్లల్లో ఒక బిళ్లని తల్లిగారు, మరో బిళ్లని అత్తగారు అని పిలుస్తాం. అంతేకాదు ఆ బిళ్లల్లో లక్ష్మీ దేవీ, సరస్వతి దేవీ కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.
2*27= 54
54*2= 108
అలా 1 పరమాత్మ, 8- ప్రకృతి , 0- జీవుడు
మెడలో ఉన్న రెండు బిళ్లలు రెండు సున్నాలు ఒకటి భార్య, రెండోది భర్త
తాళిని తాళిమి గా కొలుస్తారు. తాళిమి అంటే ఓర్పు ఎన్ని కష్టాలు వచ్చిన కుటుంబాన్ని తన సంరక్షణలో జాగ్రత్తగా చూసుకుంటుంది భార్య. అందుకే భార్యను భరించేది అంటుంటారు మన పెద్దలు….