telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: సీఎం జగన్

లాక్ డౌన్ అమలవ్తున్న నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి ఉండకూడదని కలెక్టర్లను ఆదేశించారు.

రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ అత్యంత ప్రాధాన్యతా అంశాలని, ఇవి జూన్ నుంచి పనిచేయాలని టేకుఒయారి, నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేయాలని, రెండు రోజుల కొకసారి నిత్యావసర సరుకుల ధరలను ప్రకటించాలని ఆదేశించారు. ఒక రేషన్ దుకాణం పరిధిలో రెండు, మూడు కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రేషన్ సరుకుల వచ్చే వారు గుమిగూడకుండా ఉండే నిమిత్తం టోకెన్ల విధానం పాటించాలని అధికారులకు సూచించారు.

Related posts