telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ క్లాస్‌లకు వెళ్తుతున్న రష్మిక…

కన్నడ హీరోయిన్ రష్మిక మందన్నకి ఇప్పుడు టాలీవుడ్‌లో ఫుల్‌క్రేజ్ ఉంది. కుర్రహీరోలతో పాటుగా స్టార్ హీరోలతోను కలిసి నటిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మలు టాలీవుడ్లో సక్సెఫుల్ హీరోయిన్ గా చలామణి అవుతున్నారు. అందువల్ల బాగా డిమాండ్ పెరిగింది. రష్మిక మందన్న కూడా ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో ‘మైండ్ బ్లాక్’ సాంగ్ లో హాట్ గా గ్లామర్ ఒలకబోస్తూ కిర్రాక్ స్టెప్పులేసి యూత్ మతులు పోగొట్టింది. ఈ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న కన్నడ భామ రష్మిక ఆ వెంటనే ‘భీష్మ’ తో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే.. సిద్ధార్థ్‌ మల్హోత్రా నటిస్తున్న మిషన్‌ మజ్ను సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది ఈ భామ. ఈ సినిమా కోసం రష్మిక ప్రత్యేకంగా సిద్ధమైందట. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రష్మిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందట. ఈ నేపథ్యంలో ఈ భామ కొన్ని ఆన్‌లైన్‌ క్లాస్‌లకు కూడా వెళ్లిందట. తన పాత్రకు అవసరమైన అన్ని విషయాలను నేర్చుకుందట. ఇటీవలె సిద్ధార్థ్‌తో కలిసి లక్నోలోని షూటింగ్‌ స్పాట్‌ కు వెళ్లింది రష్మిక.

Related posts