telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌కు కుమారుడిగా జన్మించినందుకు గర్వపడుతున్నా!

KCR Family members plants camp office

తెలంగాణ సీఎం కేసీఆర్‌ జన్మదినం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు మొక్కలు నాటారు. సీఎం సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, అయన సతీమణి, మనవరాలు పాల్గొన్నారు.కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో మొక్కను నాటారు.

కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నిండు జీవితం గడపాలని  కేటీఆర్‌ ఆకాంక్షించారు. నిబద్ధత కలిగిన పోరాట యోధుడు  అని  కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, కేసీఆర్‌కు కుమారుడిగా జన్మించినందుకు ఎంతో గర్వపడుతున్నానని కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Related posts