హైదరాబాద్ శివారు శంషాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై గత మూడు నెలలుగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వేణు అనే యువకుడు ఆ బాలికకు మాయ మాటలు చెప్పి శంషాబాద్ నుండి ఏపీకి తీసుకొని వెళ్లాడు. మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సింగరాయకొండకు తీసుకొని వెళ్లిన యువకుడు… పెండ్లి చేసుకోకుండా గత మూడు నెలలుగా బాలికపై అగాయిత్యానికి పాల్పడ్డాడు. అసలు విషయం తెలియడంతో శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసారు బాలిక కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు… బాలికను తీసుకొని వెళ్లిన కేటుగాడు వేణును బెంగుళూరులో అరెస్ట్ చేశారు. యువకుడిపై అత్యాచారం, పొస్కో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకి తరలించారు పోలీసులు. గత మూడు నెలల క్రితం శంషాబాద్ పెద్ద షాపూర్ గ్రామం నుండి అదృశ్యమైన మైనర్ బాలిక… అసలు విషయం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
previous post
జగన్ సీఎం అయ్యాక ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయి: చంద్రబాబు