తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో అలరించిన బిగ్‌బాస్ -5 సీజన్ తెలుగు విన్నర్‌గా వీజే సన్నీ నిలిచాడు. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ గెలుపుకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు. తనకున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పెద్ద మొత్తంలో ఓట్లు సాధించినప్పటికీ సన్నీని దాటలేకపోయాడు. దీంతో రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్-5లో మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు పాల్గొనగా తన ఆట తీరు మెప్పించి, ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలచుకున్నాడు. అప్నా టైం ఆయేగా.. అన్నట్టుగానే అతని టైం వచ్చింది.
టాప్-5లో సన్నీతో పాటు షణ్ముఖ్, మానస్, శ్రీరామచంద్ర, సిరి నిలవగా.. ఓటింగ్‌లో వాళ్లను వెనక్కి నెట్టి ఈ సీజన్ విజేతగా సన్నీ చరిత్ర సృష్టించాడు. ఎన్నో ఏళ్లుగా సన్నీ పడుతున్న కష్టానికి నేడు ప్రతిఫలం దక్కిందని అతడి తల్లి భావోద్వేగానికి లోనైంది.
ఈ సందర్భంగా విజేత వీజే సన్నీ మాట్లాడుతూ.. ‘‘ఓటు వేసి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు. నాతో పాటు జర్నీ చేసిన 19మంది కంటెస్టెంట్‌లను ఎప్పటికీ మర్చిపోలేను. నా వల్ల అయినంత వరకూ ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటా.నేను కప్పు గెలుచుకోవడంలో నాగార్జున గారి మోటివేషన్, స్నేహితుల సహకారం, మా అమ్మ ప్రోత్సాహం మర్చిపోలేను. మా అమ్మ అడిగిన మొదటి గిఫ్ట్ ఇది. ఆమెకు ఇచ్చేస్తున్నా’’ అని సన్నీ చెప్పుకొచ్చాడు.
అలాగే కొత్త సంవత్సరంలో రెండు నెలలు తిరగకముందే ‘బిగ్‌బాస్ సీజన్-6’ ప్రారంభం కానున్నట్లు ఈ సందర్భంగా నాగార్జున ప్రకటించారు.
అంచనాలు అర్థమవుతున్నాయి : ప్రభాస్