telugu navyamedia
సినిమా వార్తలు

వర్మపై నెటజన్లు ఫైర్

RGV
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తాను పోటీకి దిగుతున్నట్టుగా వర్మ ట్వీట్ చేశారు. “నేను భీమవరంలో పవన్ కల్యాణ్‌కి వ్యతిరేకంగా పోటీకి దిగుతున్నా… మరింత సమాచారం కోసం వెయిట్ చెయ్యండి” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు “నామినేషన్ల గడువు ఎప్పుడో ముగిసింది… నువ్వు ఎప్పుడు నామినేషన్ వేశావు?, ఎన్నో పెగ్ ?” అంటూ పలు కామెంట్లతో విరుచుకు పడ్డారు. ఆ ట్వీట్ తరువాత మరికొన్ని గంటల్లోనే వర్మ “ఇది జస్ట్ అడ్వాన్స్ ఏప్రిల్ ఫూల్ జోక్… నేను చెప్పింది నమ్మేంత పిచ్చోళ్లెవరూ లేరని నాకు తెలుసు” అంటూ మరో ట్వీట్ చేశారు. దీంతో “నిన్నటిది ఇప్పుడు దిగిందా?” అంటూ మరోసారి ఫైర్ అయ్యారు నెటిజన్లు. ఇక వర్మ స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న “లక్ష్మీస్ ఎన్టీఆర్” విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

Related posts