telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఆర్ఆర్ఆర్”లో ఆలియా భట్ స్థానంలో మరొకరు ?

rrr

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరీస్ వీళ్లకు జంటగా నటిస్తున్నారు. హిందీ నటుడు అజయ్ దేవ్ గన్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. లేదంటే ఈ పాటికే టాకీపార్ట్ ఓ కొలిక్కి వచ్చేది. ఇప్పుడు షూటింగ్స్‌కి అనుమతి లభించినా కూడా ధైర్యంగా షూటింగ్‌కు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే ముందు ట్రయల్ షూట్ చేద్దామని భావించి కూడా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అనుమతులు రాక వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అయితే ఈ పరిస్థితుల్లో ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందో చెప్పడం రాజమౌళి వల్ల కూడా కావడం లేదు. ఇప్పుడు ఈ సినిమాకి మరో కొత్త సమస్య వచ్చి పడింది. సక్రమంగా షూటింగ్ జరిగినట్లయితే అందరి డేట్స్ సక్రమంగా వినియోగించబడేవే. కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో.. ఇప్పుడు ఆర్టిస్ట్‌ల డేట్స్ విషయంలోనూ రాజమౌళికి తలనొప్పి తప్పడం లేదు. అందులో ముఖ్యంగా చరణ్ సరసన అనుకున్న ఆలియా భట్ ఈ సినిమాకి కేటాయించిన డేట్స్ అయిపోయాయని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమె చేయాలనుకున్న కొత్త ప్రాజెక్ట్స్‌కి ఆమె వెళ్లేందుకు రాజమౌళితో మాట్లాడినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రాజమౌళి మాత్రం ఏం చెప్పలేని పరిస్థితులలో ఉన్నామని తెలిపినట్లుగా టాక్. దీంతో ఈ సినిమాలో ఆలియా భట్ నటించడం డౌటే అనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించి షూట్ చేయాల్సిన మేజర్ పార్ట్ కూడా ఆమెదే కావడం విశేషం. మరి ఇప్పుడు రాజమౌళి ఆలియా భట్ కొత్త డేట్స్ తీసుకుంటాడా ? లేదంటే ఆలియా స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకుంటాడా ? అనేది చూడాలి.

Related posts