సినీ నటుడు, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఎన్నో ఎళ్ల నుండి వైసీపీ పార్టీ తరపున ఆయన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. మళ్లీ తమ మార్కును చూపించారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ తన హవా కొనసాగించిన దానిపై ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎలాంటి ఆదరణ ఉందో ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారికి అదే ఆదరణ ఉంది. కార్యకర్తలను కూడా చాలా ప్రేమగా రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడికి వెళ్లినా.. ఏ గడపని అడిగినా ఆయన అందించిన సంక్షేమ పథకాలు.. సంక్షేమ ఫలాలు అందించే నాయకుడే మాకు కావాలి అని ముక్తకంఠంగా చెపుతున్నారు. ఈసారి కూడా వైసీపీనే గెలిపిస్తాం అంటున్నారు. ప్రతిపక్షంతో మాకు సంబంధం లేదు.. ఇంచు మించు అన్ని స్థానాలు వైసీపీ కైవసం చేసుకోవడంతో మళ్లీ పండుగ వాతావరణంగా నెలకొంది అన్నారు.
previous post
అమరావతిని దెబ్బతీయడంతో.. హైదరాబాద్ కు వలసబాట: చంద్రబాబు