హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా “వాల్మీకి” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొంతకాలం క్రితం తమిళంలో వచ్చిన “జిగర్తాండ” సినిమాకు ఇది రీమేక్. ఆ సినిమాలో బాబీసింహా పోషించిన పాత్రను వరుణ్ తేజ్, సిద్ధార్థ్ పోషించిన పాత్రను అధర్వ మురళి చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. మృణాళిని రవి మరో హీరోయిన్ గా నటిస్తోంది. “వాల్మీకి” చిత్రాన్ని ఆచంట రాము, గోపినాథ్ లు 14రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే విడుదలకు ముందే ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుతుంది. ఈ సినిమాకు “వాల్మీకి” అనే టైటిల్ పెట్టడంపై అనంతపురానికి చెందిన వాల్మీకి సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. డబ్బుల కోసం ఓ ఫైటింగ్ సినిమాకు “వాల్మీకి” అని పేరు పెట్టినట్టు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై వాల్మీకి సంఘం అభ్యంతరాలపై దర్శకుడు హరీష్ శంకర్ ట్విటర్ ద్వారా స్పందించారు. “వాల్మీకి పూజించిన రాముడు కూడా ధర్మం కోసం ఫైటింగ్ చేశాడు. ఏదేమైనప్పటికీ మేం వాల్మీకి సంఘం అభిప్రాయాలను గౌరవిస్తాం” అని ట్వీట్ చేశారు. అనంతరం ఈ సినిమాలో హీరో పేరు వాల్మీకి కాదని, అంత గొప్పవాడైన వాల్మీకి పేరు తన హీరోకి పెట్టలేదు” అని తెలియజేశారు.
previous post
మహేష్ తో సినిమా… పూరీ సంచలన వ్యాఖ్యలు