telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్‌బాస్-4” : బిగ్‌బాస్ ప్రోమో చిత్రీక‌ర‌ణలో నాగార్జున

Bigg-Boss-4

బిగ్ బాస్ 4 ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆశగా ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్‌కు ఇటీవలే స్టార్ మా అప్‌డేట్ ఇచ్చింది. బిగ్ బాస్ 4 ప్రోమోను విడుదల చేసింది. కేవలం టైటిల్ లోగోను మాత్రమే ఈ ప్రోమోలో చూపించారు. అక్కినేని నాగార్జున తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 హోస్టింగ్‌కి సిద్ధ‌మ‌వుతున్నారు. త్వ‌ర‌లోనే ప్ర‌సారం కానున్న బిగ్‌బాస్ షోకు సంబంధించిన యాడ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఇందులో నాగార్జున పాల్గొంటున్నారు. కె.కె.సెంథిల్ కుమార్ ఈ యాడ్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ లో షూట్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ యాడ్ ప్ర‌సారం కానుంది. మూడో సీజన్​ వ్యాఖ్యాతగా అద‌ర‌గొట్టిన‌ హీరో నాగార్జున యే ఈ సీజన్​కు కూడా హోస్ట్​గా సంద‌డి చేయ‌నున్నారు.

Related posts