telugu navyamedia
సినిమా వార్తలు

ఈరోజు పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వర రావు 98వ జయంతి..

పల్లెటూరిలో పుట్టి పెరిగి , ప్రాధమిక విద్య తో నాటక రంగంలోనూ , ఆతరువాత సినిమా రంగంలోనూ ప్రవేశించిన అక్కినేని ఎన్ని విజయాలు సాధించాడో అందరికీ తెలుసు . హై స్కూల్ , కాలేజీ మెట్లక్కని నాగేశ్వర రావులో చదువుకోలేదనే న్యూనతా భావం ఉండేది . అందుకే అనేక విశ్వవిద్యాలయాలకు తన పేరు మీద డబ్బు విరాళంగా ఇచ్చాడు .

Remembering Akkineni Nageswara Rao on his birth anniversary: Rare Pictures - Photos,Images,Gallery - 30809

నాగేశ్వర రావు లో పట్టుదల ఎక్కువ . అదే ఆయన్ని విజయ పథం లో నడిపించింది . తన సినిమాలకు పని చేసిన రచయితల స్ఫూర్తి తో భాషను నేర్చుకోవడం మొదలు పెట్టాడు . ఇంగ్లీష్ భాష కోసం హిందూ దినపత్రిక చదవడం అలవాటు చేసుకున్నాడు .

This is what Nagarjuna has to say about ANR biopic | Telugu Movie News - Times of India

అలా దిన దిన ప్రవర్ధమానంగా ఎదిగాడు . 1964లో అమెరికా ప్రభుత్వ ఆహ్వానం అందుకుని సినిమా నటుడుగా అక్కడ పర్యటించారు . తిరిగి మద్రాస్ వచ్చిన తరువాత ఆయన గౌరవార్ధం ఒక సమావేశం ఏర్పాటు చేశారు . ఆ సమావేశంలో అక్కినేని ఇంగ్లీషులో అనర్గళంగా ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు .
జీవిత అనుభవాలను ఆయన కవితారూపంలో వ్రాశారు .

Devadasu (1953) | Cinema Chaat

అవన్నీ కలిపి ” అ ఆ లు ” (అక్కినేని ఆలోచనలు ) పేరుతో పుస్తకం ప్రచురించారు .
అందులో నుంచి ఆయన 98వ జయంతి సందర్భగా రెండు కవితలు నవ్య పాఠకుల కోసం .

Related posts