telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీహార్ ఎన్నికలు : యోగి పైనే సీఎం నితీష్ కౌంటర్

బీహార్‌ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీహార్‌ లో ఇప్పటికే రెండో విడత పోలింగ్‌ పూర్తయింది. అయితే…ఈ ఎన్నికల ప్రచారంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. యూపీ సీఎం ఆదిత్యపై బీహార్‌ సీఎం నితీష్‌ కౌంటర్‌ వేసాడు. ఇప్పుడు ఇది అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే…బీహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ సీఎం యోగి ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”చొరబాటు దారు సమస్యకు ప్రధాని ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. సీఏఏ ద్వారా పాక్‌, అఫ్గనిస్థాన్‌, బంగ్లాలో హింసకు గురవుతున్న మైనారీటీల భద్రతకు ఆయన భరోసా ఇచ్చారు. చొరబాటుదారులను మోడీ బయటికి పంపిస్తారు” అని స్పష్టం చేశారు. అయితే..దీనిపై నితీష్‌ కూమార్‌ కౌంటర్‌ వేశాడు. సీఎం యోగి పేరును ప్రస్తావించకుండా తీవ్రంగా ధ్వజమెత్తారు. “ప్రజలను ఎలా బయటకు పంపిస్తారు. ఇలాంటి పిచ్చి మాటలు ఎవరు చెప్పారు? ప్రతి ఒక్కరూ భారతీయులే. భారత దేశం అంటే అన్ని మతాల కలయిక. దేశంలో విభజన తీసుకురావడానికే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. వారికి వేరే పని లేదు” అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీపై నితీష్‌ ఇలా విరుచుకుపడటం రాజకీయ లబ్ధి కోసమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Related posts