telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి తల్లి కాబోతున్న కరీనా.. స్వయంగా ప్రకటించిన సైఫ్ అండ్ కరీనా

బాలీవుడ్ ప్రముఖ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ మరోసారి అమ్మానాన్నలు కాబోతున్నారు. తమ జీవితంలోకి రెండో బిడ్డను ఆహ్వానిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ పటౌడి దంపతులు స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘మా కుటుంబంలోకి మరో వ్యక్తి చేరబోతున్నారని ప్రకటించడానికి మేం ఎంతో సంతోషిస్తున్నాం. మాపై ఎంతో ప్రేమ చూపిస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తోన్న శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతలు – సైఫ్ అండ్ కరీనా’’ అని ప్రకటనలో పేర్కొన్నారు. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కుమార్తె సారా అలీ ఖాన్ 25వ పుట్టినరోజు (ఆగస్టు 12) నాడే కరీనా కపూర్ ఖాన్ ప్రెగ్నెన్సీని ప్రకటించడం విశేషం. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా తన సవతి కూతురుకి కరీనా కపూర్ బర్త్‌డే విషెస్ కూడా చెప్పారు. తండ్రి సైఫ్‌తో కలిసి సారా ఉన్న పాత ఫొటోను కరీనా సోషల్ మీడియాలో పోస్ట్ చెప్పారు. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2016లో బాబు పుట్టాడు. అతడికి తైమూర్ అలీ ఖాన్ పటౌడి అని నామకరణం చేశారు. కరీనా కపూర్ తొలిసారి గర్భం దాల్చినప్పుడు ఆ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ప్రస్తుతం కరీనా.. కరణ్ జోహార్ చిత్రం ‘తఖ్త్’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, అలియా భట్, విక్కీ కౌశల్, భూమి పడ్నేకర్, జాన్వి కపూర్, అనిల్ కపూర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Related posts